Wednesday, April 21, 2021

Latest Posts

ప్రధాని ప్యాకేజిని స్వాగతిస్తున్నాం: కమల్ హాసన్

ప్ర‌ధాని భారీ ఉద్దీపన ప్యాకేజిపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు. ప్రధాని పేర్కొన్న రెండు అంశాలతో తాము కూడా ఏకీభవిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ  సంక్షోభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వావలంబనతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారని, వాటిని తాము కూడా అంగీకరిస్తున్నామని కమల్ ట్వీట్ చేశారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని కూడా స్వాగతిస్తున్నామని, అయితే, కేంద్రం ఈ విషయంలో పూర్తి వివ‌రాలు అందిస్తుంద‌ని చెప్పుకొచ్చింది. అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు క‌మ‌ల్. ఆ మ‌ధ్య క‌మ‌ల్‌..ప్ర‌ధాని చేప‌ట్టిన దీపాలు వెలిగించే కార్య‌క్ర‌మంతో పాటు వ‌ల‌స కూలీల విష‌యంలో అనాలోచిత వైఖ‌రిని ఖండించిన సంగ‌తి తెలిసిందే.

ఇది కూడా చదవండి: సాయంత్రం 4 గంటలకు ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss