దసరా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు(ఈ రోజు) అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం, పరమార్థం ఉన్నాయి. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు తెలిపారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: