విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు అమ్మవారు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇరువైపులా గజ రాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి , అభయ , వరద ముద్రలతో , మహాలక్ష్మీ స్వరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది. సిరిసంపదలు , సంతానం , సౌభాగ్యం , ధైర్యసాహసాలు , విజయాలకు ఈ తల్లి అధిష్టాన దేవత శ్రీమహా లక్ష్మీ. సకల లోకాలకు ఈమె ఐశ్వర్యప్రదాత. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు లైన్లలో బారులు తీరారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా, అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.
ఇది కూడా చదవండి: