Sunday, June 20, 2021

Latest Posts

బాలీవుడ్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ బారిన పడిన మరో హీరోయిన్. ఆమె మరెవరో కాదు ఎప్పుడూ వివాదాల్లో ముందుండే కంగనా రనౌత్. గత కొద్ది రోజులుగా ఆమె హిమాచల్ ప్రదేశ్ కి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళే ముందు టెస్ట్ చేయించుకోగా ఆమె కరోనా పాజిటివ్ గా తేలింది.

గత కొన్ని రోజులుగా నా కళ్ళలో కొంచెం మంటతో పాటు కాస్త అలసి పోయినట్టుగా అనిపించింది. అయితే తాజాగా కోవిడ్ పాజిటివ్ గా తేలాను అని ఆమె తెలిపింది. ప్రస్తుతం, నేను నన్ను నిర్బంధించుకున్నాను, ఈ వైరస్ నా శరీరంలో చేరింది, ఇప్పుడు నేను దానిని విజయవంతంగా ఎదుర్కొంటానని నాకు తెలుసు.

కంగనా ఇంకా ఏం చెప్పిందంటే, ప్రజలు దయచేసి మీరు భయపడితే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది, కాబట్టి ఎవరూ భయపడకండి. ధైర్యంగా ఈ కోవిడ్ -19 ను నాశనం చేద్దాం, ఇది ఫ్లూ తప్ప మరేమీ కాదు, హర్ హర్ మహాదేవ్ అంటూ చెప్పింది.

గత కొన్ని రోజులుగా కంగనా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ప్లాట్‌ఫాం నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్విట్టర్ ఆమె ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయడం.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss