Saturday, March 6, 2021

Latest Posts

సుజనా,చంద్రబాబు డైరెక్షన్ లో కన్నా నడుస్తున్నాడా

ఏపీలో అధికార విపక్షాల నడుమ ఆరోపణలు,విమర్శలు ఎక్కడా ఆగడం లేదు. ఎవరి రేంజ్ లో వాళ్ళు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ టీవర్గంగా ఖండించారు.హిందు మతాన్ని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడో చిన్న ఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా రథం కాల్చివేసిన ఘటనపై చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. దేవాలయాలు ఎవరూ కూలదోసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చారించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల్లో వేల కోట్ల రూపాయలను దోచుకున్నప్పుడు, విజయవాడలో దేవాలయాలను కూల్చివేసినప్పుడు కన్నా ఏమైపోయారని మంత్రి నిలదీశారు.

బీజేపీని కన్నా తెలుగుదేశం జనతా పార్టీగా మార్చివేశారని దానికి అధ్యక్షుడిగా సుజనా చౌదరి పని చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరిల డైరెక్షన్‌లో కన్నా నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో సదావర్తి భూములను దోచుకుంటే ఆయన ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో అమరావతి భూములను వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మేనిఫెస్టో కన్నాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss