Wednesday, April 21, 2021

Latest Posts

“9 నెలల్లో ప్రజల రక్తం పీల్చారు” జగన్ పై కన్నా లక్ష్మి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

Kanna Lakshmi Narayana sensational comments on YS Jagan: 

  వైసీపీ ప్రభుత్వం పరిపాలనలోకి రావడంతోనే కూల్చివేతలతో మొదలుపెట్టారు అని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ జగన్ పై మండి పడ్డారు. అమరావతిలో రైతుల దీక్ష 75 వ రోజు చేరుకున్న విషయమై ఆయన ప్రెస్సుతో మాట్లాడుతూ, ” జగన్ ప్రభుత్వం అధికారంలోకి కూల్చివేతలు, తీసివేసే కార్యక్రమాలతో మొదలయ్యింది, ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు రక్తం పీల్చుకు తాగడం తప్ప జగన్ ఏమి చెయ్యలేదు, అమరావతి రైతుల ఆందోళనలు నిరసనలు 75 రోజుల నుంచి కొనసాగుతున్న చలించటం లేదు. జగన్ పాద యాత్రలో ప్రజలుకు లేని పోనీ హామీలు, మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ 9 నెలల పరిపాలనతో ఆంధ్ర ప్రదేశ్ 9 ఏళ్ల వెనక్కి వెళుతుంది.

  అమరావతి రైతులు విషయంలో జగన్ అనుసరిస్తున్న ధోరణి సరైనది కాదని, అమరావతిగా రాజధానిని అప్పుడు అంగీకరిస్తూ ఇప్పుడు మూడు రాజధానులు అవసరమని మాట మార్చాడు. మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్ మాటలు నమ్మొద్దు, మూడు రాజధానులు దురుద్దేశంతోనే ప్రకటించారు, గత ప్రభుత్వం అనుసరించిన ధోరణిని అనుసరిస్తూ జగన్ పాలన ఉంది, కూల్చివేతలతో మొదలయిన ఈయన ఒక్క శంకు స్థాపన కూడా చెయ్యలేదు. అమరావతి రైతుల మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరందరికి బీజేపీ మద్దతు ప్రకటిస్తుంది.” అని అన్నారు. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss