Thursday, December 2, 2021

Latest Posts

బీజేపీ కండువా కప్పుకున్న కరాటే కళ్యాణి

Karate Kalyani to join BJP

సినీనటి నటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. ఆదివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కండువా  కప్పి కరాటే కళ్యాణిని పార్టీలోకి ఆహ్వానించారు.  కళ్యాణితో పాటు జల్పల్లి కౌన్సిలర్ యాదయ్య, పలువురు సినీ నటులు, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి విజయశాంతి, మాజీ మంత్రి విజయరామారావు, మహిళా మోర్చా జాతీయ నేత ఐశ్వర్యా బిశ్వాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రంగారెడ్డి రూరల్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి విజయశాంతి మాట్లాడుతూ  ఎందరో త్యాగాలతో దేశాన్ని దక్కించుకోగలిగామంటూ ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేసారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో స్వయంగా తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆ పాదయాత్ర సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని విజయశాంతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:    

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss