Monday, January 18, 2021

Latest Posts

సభలో అవమానంతో ఆత్మహత్య చేసుకున్న మండలి డిప్యూటీ ఛైర్మన్

Karnataka Deputy Chairman SL Dharmegowda

కర్ణాటక రాజకీయంలో విషాద ఉదంతం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కర్ణాటక రాజకీయాన్ని కదిలించింది. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగ్ ళూరు వద్ద ఆయన శవాన్ని పోలీసులు గుర్తించారు.

రైలు కింద తల పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన మృతదేహం వద్దే.. సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం ఆయన ఒంటరిగా కారులో బయలుదేరినట్లుగా చెబుతున్నారు. ఈ నెల 15న కర్ణాటక శాసన మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలువురు కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగేయటం తెలిసిందే.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంతో తీవ్ర మనస్తాపానికి గురైన డిప్యూటీ ఛైర్మన్.. ఆత్మహత్య చేసుకోవటానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఉదంతంతోనే సూసైడ్ చేసుకున్నారా? మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss