Monday, January 18, 2021

Latest Posts

పూజారిని పెళ్లాడితే 3 లక్షల బాండ్ మీ సొంతం

Karnataka Govt Maithri Scheme
ఆలయాల్లో పూజలు చేసే అర్చకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం రూ.3 లక్షల బాండ్‌ను ప్రోత్సాహక బహుమతిగా అందచేయనుంది. అర్చకులు, పురోహితులను వివాహం చేసుకునేందుకు యువతులు వెనుకాడుతున్న నేపథ్యంలో వీరిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ రోజు బుధవారం ‘మైత్రి’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు చైర్మన్‌ ఎస్‌హెచ్‌ సచ్చిదానంద మంగళవారం బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. ఈ బాండ్‌ను మూడేళ్ల తర్వాత నగదుగా మార్చుకోవచ్చునని చెప్పారు.

ఇదే విధంగా నిరుపేద బ్రాహ్మణ యువతులను వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చే పురోహితులు, అర్చకులకు రూ.25 వేల ప్రోత్సాహకాన్ని అందించడంతోపాటు ఒక ఎకరాలోపు పొలం ఉన్నవారికి బోరుబావి తవ్వించేందుకు, ట్రాక్టర్‌ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందే బ్రాహ్మణ విద్యార్థులకు జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి విశ్వామిత్ర ప్రతిభా పురస్కారాలను అందిస్తామని తెలిపారు. రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss