Tuesday, January 25, 2022

Latest Posts

టి‌ఆర్‌ఎస్ లోకి చేరిన మొదటి రోజే కౌశిక్ రెడ్డికి షాక్

Kaushik Reddy Fined By GHMC

బుధవారం కాంగ్రెస్ మాజీ నాయకుడు కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన మొదటి రోజే షాక్ తగిలింది. అతనికి జి‌హెచ్‌ఎం‌సి భారీ జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే అతను టి‌ఆర్‌ఎస్ పార్టీ జాయిన్ అవుతున్నట్లుగా భారీ బ్యానర్లు, జెండాలు మరియు అతని చిత్రాలతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మరియు ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

ఈ బ్యానర్‌లపై కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రావన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మరియు జిహెచ్‌ఎంసి మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందిస్తూ, జి‌హెచ్‌ఎం‌సి అన్ని బ్యానర్లు మరియు ఫ్లెక్సిస్లను తొలగించింది. తరువాత జిహెచ్‌ఎంసి కౌశిక్ రెడ్డికి పెనాల్టీ కూడా విధించింది. జరిమానాలు, దాదాపు 10 లక్షలు ఉంటాయని సమాచారం. దీనితో కౌశిక్ రెడ్డికి టి‌ఆర్‌ఎస్ లో జాయిన్ అయ్యిన మొదటి రోజే షాక్ తగిలినట్టయ్యింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss