Tuesday, May 18, 2021

Latest Posts

ఈ పరిస్థితుల్లో ప్యాసింజర్ రైళ్ల వద్దు

ఈ రోజు మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  వలస కూలీల కోసం శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయమని కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పాజిటివ్ యాక్టివ్‌ కేసులు లేని జిల్లాల్ని ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా మార్చాలని ఈ సందర్బంగా కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. పెద్ద పెద్ద పట్టణాలలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని అందువల్ల ప్యాసింజర్ రైళ్లను పునరుధ్ధరించాలన్న ప్రతిపాదనను తాము వ్యతిరికిస్తున్నట్లు తెలిపారు.

రైళ్లను ప్రారంభించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నుండి  వచ్ఛే రైలు ప్రయాణికులను క్వారంటైన్ చేయడం ఆసాధ్యం అని పేర్కొన్నారు.  అలాగే వలస కూలీలను ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా చికిత్సకు అవసరమయ్యే వ్యాక్సీన్ ను అభివృధ్ది చేయడానికి హైదరాబాద్ లోని కొన్ని కంపెనీలు కృషి చేస్తున్నాయని, బహుశా ఆగష్టు కల్ల దానిని  అందుబాటులోకి తీసుకురావచ్ఛునని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి పట్టాలెక్కనున్న 15 రైళ్లు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss