ప్రాణాలకు తెగించి అద్భుతం గా విధులు నిర్వహిస్తున్న వైద్యులకు పారిశుద్ధ్య సిబ్బందినీ సోమవారం జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. వైద్యులు వారు చేస్తున్న పనికి వారికి చేతులు జోడించి దండం పెడుతున్న. ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్న వారి దగ్గర్నుంచి హెల్త్ డైరెక్టర్ల వరకు నా పాదాభివందనాలు ఎంత పొగిడినా తక్కువే. అలాగే నగరాన్ని అంతా శుభ్రపరిచే జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగానికి కూడా తన ధన్యవాదాలు తెలిపారు.
వైద్య శాఖ సిబ్బందికి ఇప్పటికే పూర్తి వేతనాలు చెల్లించామని వారు చేస్తున్న సేవకు గాను సీఎం ప్రోత్సాహకంగా వారి గ్రాస్ శాలరీ లో 10 శాతం ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి ఉద్యోగులకు కోత విధించిన 10 శాతం తిరిగి చెల్లిస్తామని మరియు సీఎం ప్రోత్సాహం కింద జిహెచ్ఎంసి వాటర్ బోర్డు ఉద్యోగులకు7500 రూపాయలు మరియు మున్సిపాలిటీ పంచాయతీ సిబ్బందికి 5000 రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.