Wednesday, April 21, 2021

Latest Posts

నియంత్రిత పద్దతిలో పంట సాగుకు సి‌ఎం కే‌సి‌ఆర్ ఆదేశం

సహజంగా రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు కాకుండా వారికి తోచిన పంటలు, వారి భూమికి తగ్గ పంటలు సాగు చేస్తారు. ఇలా చెయ్యడం వలన రైతులు కు లాభం కాదు కదా కనీస మద్దతు ధర కూడా లభించే అవకాశం ఉండదు. దీనికి పరిష్కారంగా, తెలంగాణ ముఖ్యమంత్రి సి‌ఎం కే‌సి‌ఆర్ “నియంత్రిత పంట సాగు” ఆలోచనను అమలులో పెట్టనున్నారు. నియంత్రిత పంట సాగు అంటే మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం తెలియచేస్తే రైతులు ఆ పంటలను పండించి ఆర్ధిక అభివృద్ధి చెందటం.
ఈ మేరకు మంత్రులు, అధికారులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో సమావేశమయిన సి‌ఎం కే‌సి‌ఆర్ రాబోయే వర్షాకాలంలో ఎటువంటి పంటలను వెయ్యాలి అన్న విషయం పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రైతులకు అందించనున్న తోడ్పాటును, ఆర్ధిక సహాయాన్ని, శాస్త్రవేత్తల పర్య్వేక్షణను, వ్యవసాయ శాఖ రైతు సధస్సులు వంటి కార్యక్రమాలపై సి‌ఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే కంపెనీలతో మాట్లాడి ముందుగానే విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss