Sunday, June 20, 2021

Latest Posts

కీర్తి సురేష్ కొత్త సినిమా ఓటిటి లో వస్తుందా

Keerthy Suresh Good Luck Sakhi Movie

కీర్తి సురేష్ కొత్త చిత్రం ‘గుడ్ లక్ సఖి’, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఓటిటిలో విడుదల అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. నివేదికల ప్రకారం జూన్ 3 న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇతర చిత్రాల మాదిరిగానే, గుడ్ లక్ సఖి కూడా కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఓటిటీ పుకార్ల పై నిర్మాత సుధీర్ చంద్ర స్పందిస్తూ ఇలా అన్నారు, “ సినిమా ఓటిటిలో విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి అయితే దీనిని మేము ఖండిస్తున్నాము. మీడియా ఇలాంటి తప్పుడు వార్తలను రాయవద్దని కోరుకుంటున్నాము. సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుందని, త్వరలోనే మీ ముందుకు కొత్త విడుదల తేదీతో వస్తామని చెప్పారు.”

ఈ చిత్రంల షూటర్‌గా కీర్తి సురేష్ నటించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన గుడ్ లక్ సఖి తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోగా ఆది పినిశెట్టి నటిస్తుండగా, కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌లో సుధీర్ చంద్ర పాదిరి, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss