Kejriwal advocate on behalf of the poor people
ప్రపంచమంతా వణికిస్తున్న కరోనా పిశాచి భారత్ ని వదల్లేదు. ఇక ఢిల్లీ నగరంలో కూడా ఈ మహమ్మారి విజృభించింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకుంటున్న చర్యలు మాత్రం అబ్బుర పరుస్తున్నాయి. ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని నగరంలో ఇంటి ఓనర్లకు సైతం ఓ విజ్జప్తి చేశారు. కరోనా వల్ల అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. చాలామందికి దీని వల్ల ఆదాయం కోల్పోయిన పరిస్థితి ఉంది.
‘ఢిల్లీ రాష్ట్రంలో ఉపాధి కోల్పోయిన పేదల తరఫున విజ్జప్తి చేస్తున్నాను. దయచేసి అద్దెకోసం వేధించొద్దు. బలవంతంగా వసూలు చేయొద్దు. సాటి పౌరుడిగా బాధ్యత తీసుకోండి’ అంటూ ఇంటి ఓనర్లకు కేజ్రీవాల్ కోరారు. ‘ఇపుడు ఎవరికీ డబ్బులు పుట్టడం లేదు. మళ్లీ ఈ కరోనా అనంతరం వారు తిరిగి సంపాదించి మీ పెండింగ్ అద్దె తప్పకుండా కడతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. వారికి అద్దె ఆలస్యంగా కట్టుకునే అవకాశం ఇవ్వండి’అని సీఎం కేజ్రీవాల్ కోరారు.
ఇది మనందరికి మూకుమ్మడిగా వచ్చిన కష్టం. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విజ్జప్తిని చేస్తున్నాను. ఇది ఒక సాటి పౌరుడిగా నా విజ్జప్తి అంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీావాల్ దిగువ మధ్యతరగతి – పేద ప్రజలకు తన పథకాలతో గౌరవంగా బతికే అవకాశం ఇచ్చిన వ్యక్తి. వారి స్కూళ్లను బాగు చేశారు. వారికోసం ఆస్ప్రత్రులను బాగు చేశారు. అందుకే మూడోసారి ఢిల్లీ పీఠం ఎక్కారు. తాజా ప్రకటనతో ఆయన పేదల మనసు మరోసారి దోచుకున్నారు