Tuesday, March 9, 2021

Latest Posts

శబరిమల యాత్ర కు కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్

నవంబర్ నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కాబోతున్నది. లక్షలాది మంది భక్తులు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు శబరిమల బయలుదేరి వెళ్తుంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్ర చేస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరిగే యాత్రపై ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించింది. పంపానది, నెయ్యఅభిషేకంపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. దీంతో పాటుగా కేరళ ప్రభుత్వం యాత్రపై కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ముందుగా వర్చువల్ క్యూ పోర్టులో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వారం ప్రారంభంలో 1000 మందిని, వారాంతరాల్లో 2000 మందిని శబరిమలకు అనుమతి ఇస్తారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి 48 గంటల ముందు తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. శబరిమల యాత్రకు వచ్చిన వారు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర భీమా కార్డులను తెచ్చుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. 10 సంవత్సరాలోపున్న పిల్లలు, 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు యాత్రకు అనుమతి లేదు.అలాగే దీర్ఘకాలిక గుండె జబ్బులు ఉన్న వ్యక్తులను కూడా యాత్రకు అనుమతించడం లేదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పంపానది స్నానం, నెయ్యభిషేకాలు, సన్నిధానంలో రాత్రి బస వంటి వాటిపై నిషేదం విధించారు. ఎరుమేలి, వడసెర్రికర మార్గాలు మినహా మిగతా మార్గాలను మూసేశారు. ఈ రెండు మార్గాల ద్వారా మాత్రమే భక్తులు శబరిమలకు చేరుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి:

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss