Home సినిమా వార్తలు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న కేజీఎఫ్ 2

సర్‌ప్రైజ్ ఇవ్వనున్న కేజీఎఫ్ 2

Kgf2 Movie Latest News, Kgf2 Movie Updates, Tollywood Movie, NewsKGF2 Makers Planning To Unveil A Surprise For Fans, KGF2, Latest Movies News

అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్‌ అయితే దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించినా  విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జూలై 29న సంజయ్ బర్త డే సందర్భంగా అధీరా పాత్రకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది కూడా ఏదైన సర్‌ప్రైజ్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 2 చిత్రంలో యశ్‌, సంజయ్ దత్‌ల మధ్య ఆసక్తికర పోరు ఒకటి ఉండనుందని అంటున్నారు. ఇది ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. వచ్చే నెలలో కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుండగా, ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: 

 

Exit mobile version