Thursday, May 13, 2021

Latest Posts

55 కోట్లు పలికిన KGF డిజిటల్ రైట్స్

KGF తెలుగు, కన్నడ, హింది భాషల్లో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియన్ మూవీ గా సూపర్ హిట్ కొట్టిన ఈ కన్నడ మూవీకి ప్రస్తుతం దీని సీక్వెల్ అయిన KGF 2 కూడా సిద్దమవుతుండటం విశేషం. కాగా కే‌జి‌ఎఫ్ ను డైరెక్ట్ చేసిన అదే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే‌జి‌ఎఫ్ 2 కు కూడా దర్శకత్వ భాద్యతలు నెరవేరుస్తున్నారు. కాగా హిందీ భాషలో కూడా ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చెయ్యడం విశేషం. కాగా కే‌జి‌ఎఫ్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది.

అప్పట్లో ఈ సినిమాకు డిజిటల్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి. బానిసత్వం ఉన్న నిరంకుశ పాలనలో అనగారిపోతున్న అభాగ్యులను తన వైపు మలచుకుని వారిలో ఒకరిగా కలిసి తాను రాజు అయ్యే అద్బుత కధాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రెండో పార్ట్ కే‌జి‌ఎఫ్ 2 గా రాబోతుంది, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ 55 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ ధర ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ను మార్కెట్ లో కాష్ చేస్తుంది అనే పాయింట్ ఈసీ గా తెలుస్తుంది. కాగా కే‌జి‌ఎఫ్2 తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో పాన్ ఇండియన్ మూవీ గా రూపుదిద్దుకుంటుంది.

ఇది కూడా చదవండి: నాగ్ ట్వీట్ కి రౌడీ స్టార్ రీట్వీట్

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss