Sunday, June 13, 2021

Latest Posts

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు పలు మార్లు ఫోన్ చేసి బాలుడ్ని విడిచిపెట్టాలి అంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇచ్చేందుకు కూడా దీక్షిత్ తల్లిదండ్రులు సిద్ధం అయ్యారు.

కాగా గత రాత్రి డబ్బు అందజేసేందుకు దీక్షిత్ తండ్రి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీక్షిత్ హత్య కేసులో వారి బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ తో సహా మరో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిని ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. కానీ కిడ్నాప్ చేసి చంపేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss