Thursday, December 2, 2021

Latest Posts

కిమ్ తలకు ఏమైంది

Kim Jong Un’s Bandage And Spots On Head

మరోసారి ఆరోగ్య కారణాలతో వార్తల్లోకెక్కిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37). గతేడాది అనారోగ్యంతో ఆయన చనిపోయాడన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించడం ఆ తర్వాత కొన్ని రోజులకు కిమ్ మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇలా రెండు మూడు సార్లు కిమ్ కొన్ని రోజులు కనిపించకుండా పోవటం మళ్ళి అయన బ్రతికే ఉన్నాడు అని అక్కడి మీడియా ఫొటోలతో చూపించడం జరుగుతుంది. అయితే తాజాగా తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యేలా తలకు బ్యాండేజీతో కిమ్ దర్శనమిచ్చారు. జులై 24-27 మధ్య నిర్వహించిన కొరియా పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి ఫొటోల్లో కిమ్​ తల వెనక భాగంలో బ్యాండేజీ కనిపించింది.

ఈ ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. అయితే జులై చివర్లో జరిగిన మరో కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నప్పటి ఫొటోల్లో.. బ్యాండేజీ స్థానంలో ఆకుపచ్చ రంగులో ఓ మచ్చ కనిపించింది.ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్​గా మారాయి. దీంతో కిమ్​ ఆరోగ్యానికి ఏమైందని మరోసారి చర్చ ఊపందుకుంది. కని అక్కడ మీడియా మాత్రం  కిమ్ ఆరోగ్యం అసాధారణంగా ఏమీ లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. జులై 11న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తలపై ఎలాంటి బ్యాండేజీలు కనిపించలేదని పేర్కొంది దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss