Tuesday, April 13, 2021

Latest Posts

కిమ్ వారసురాలిగా సోదరి కిమ్ యో జాంగ్

Kim Sister Kim Yo-jong will be the next north korea leader :

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ దశలోనే ఆయన వారసత్వం ఎవరు అంది పుచ్చుకుంటారనే చర్చ ప్రారంభమయ్యింది. కిమ్ జాన్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ ఉత్తర కొరియా అధ్యక్షులు అవుతారనే వారాలు జోరుగా షికారు చేస్తున్నాయ్. ఇప్పటికే ఉత్తర కొరియా దేశం పై కిమ్ యో జాంగ్ పట్టు సాధించారని సమాచారం. తన అన్న కిమ్ జాన్ ఉన్ లక్షణాలను వత్తపట్టించుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కిమ్ జాన్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలొస్తున్న సమయంలో వీరి ఎంపిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. కిమ్ వంశంలో కిమ్ జాన్ ఉన్ తరవాత అంతటి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిగా కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ గుర్తింపు పొందారు.

గత నెలలో దక్షిణ కొరియాపై భయపడే కుక్క మొరుగుతుంది అంటూ కిమ్ యో జాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చెయ్యడం ద్వారా కిమ్ జాన్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ వెలుగులోకి వచ్చింది. కాగా ఈ వ్యాఖ్యలు చెయ్యమన్నట్టు స్వయంగా తన అన్న కిమ్ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే కాదు తన సోదరి కిమ్ యో జాంగ్ తనలా ప్రవర్తించాలని ఇప్పటికే కిమ్ సూచించినట్టు తెలుస్తుంది. ఇక దేశం పై ఇప్పటికే పట్టు సాధిస్తున్న కిమ్ యో జాంగ్ నాయకత్వ లక్షణాలు అలవరచుకునేందుకు మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నట్టు సమాచారం, ఇక ముప్పై ఆరేళ్ళ కిమ్ జాన్ ఉన్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమిస్తు ఉండడంతో కిమ్ యో జాంగ్ త్వరలోనే ఆ దేశ పగ్గాలు చేపడతారని సమాచారం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss