Monday, July 26, 2021

Latest Posts

కేబినెట్ మంత్రిగా ఎన్నికైన కిషన్ రెడ్డి స్పందన

Kishan Reddy Speech

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డి కి ప్రమోషన్ లభించింది. నిన్న సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని ఆయన చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని, జల వివాదాన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పారు. ప్రధాని మోదీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు. అయితే రీజినల్ రింగ్ రోడ్డును హైదరాబాదుకు కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చిందని చెప్పారు. ఇక పై దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రిగా కరోనా సమయంలో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని తొమ్మిదిసార్లు సందర్శించానని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss