Monday, April 19, 2021

Latest Posts

టెస్టు సిరీస్‌కి గాయంతో దూరమయ్యిన మరో భారత ప్లేయర్

ఆస్ట్రేలియాకు వెళ్ళిన భారత్ కు గాయల బెడద ఇంకా పోలేదు. సిరీస్ చివరి అంకం వరకు చేరుకున్న భారత్ కు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే గాయాలతో మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. తాజాగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో మూడో టెస్టు కోసం సిద్దమవుతున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు.  బ్యాటింగ్ చేస్తుండగా అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. దీంతో రాహుల్‌ స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మిగిలిన రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని పేర్కొంది. రాహుల్‌ పూర్తిగా కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుందని, బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో అతడు చికిత్స పొందుతాడని తెలిపింది. ఇక టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పితృత్వ సెలవుపై భారత్‌కు రాగా, స్టార్ బౌలర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌ గాయాల కారణంగా స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. మూడవ టెస్ట్ మ్యాచ్ జనవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss