బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కేఎన్ లక్ష్మణన్ సేలం (92) మృతి చెందారు. లక్ష్మణన్ 2001లో చెన్నై మైలాపూరు నియోజకవర్గంలో పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని రెండు పర్యాయాలు సమర్థవంతంగా నిర్వహించారు. కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సేలం సెవ్వాపేటలోని తన నివాసగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బీజేపీ సీనియర్ నేత కేఎన్ లక్ష్మణన్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో కేఎన్ లక్ష్మణన్ తమిళ ప్రజలకు ఎనలేని సేవలందించారని, పార్టీ విస్తరణకు పాటుపడ్డారని, ప్రత్యేకించి దేశంలో అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు.
ఇది కూడా చదవండి: