Friday, January 22, 2021

Latest Posts

నేడు కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలకు సర్కారు బ్రేక్

నేడు టీడీపీ సీనియర్ నేత ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో టీడీపీ నేతలు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. అయితే  వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. కోడెల తొలి వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కోడెల ఫ్యామిలీకి నిరాశ తప్పడం లేదు. కోడెల శివప్రసాద్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు మానుకోవాలని కోరుతూ గుంటూరు పోలీసులు కోడెల తనయుడు శివరామ్‌కు నోటీసులు ఇచ్చారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ప్రజలు భారీగా గుమికూడటం కానీ, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌ పరిస్ధితుల్లో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెడితే ప్రజలు సామాజిక దూరం నిబంధనలు వదిలిపెట్టి ఒకే చోట గుమికూడే అవకాశం ఉందని, తద్వారా వైరస్‌ ప్రబలుతుందని పోలీసులు తమ నోటీసుల్లో తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss