Kohli and Rohit rest for South Africa series:
ఈ నెల 12 నుంచి స్వదేశంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. తీరికలేని షెడ్యూల్, ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారట.
అంతేకాకుండా రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే కాలిపిక్క గాయం నుంచి కోలుకుంటుండటంతో ఈ సిరీస్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్, వైస్ కెప్టెన్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.
ఈ క్రమంలోనే సఫారీలతో ఆడనున్న వన్డేలకు ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలన్న దానిపై సెలెక్టర్లు డైలమాలో పడ్డారట.
ఆ తర్వాత టీ20 స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్లు నిలిచారు. వీళ్ళ ముగ్గురిలో ఒకరు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారట. అటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ సిరీస్‌తోనే కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడు.
కాగా, రాహుల్, అయ్యర్లు ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే. కాగా, కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు.