Monday, May 10, 2021

Latest Posts

కోహ్లి పుష్ప ఫోటో పై స్పందించిన అల్లు అర్జున్

Kohli As Allu Arjun Pushpa

స్టైలిష్ స్టార్ అలియాస్ ఐకాన్ స్టార్, అల్లు అర్జున్ అతని నటన మరియు డ్యాన్స్ తో జాతీయ స్థాయి గుర్తింపు సాధించదనడంలో ఎటువంటి సందేహం లేదు. అతను దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పుష్ప టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన వెంటనే మిలియన్ కి పైగా వ్యూస్ మరియు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఐపిఎల్ 2021 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ను రెండు వికెట్ల తేడాతో చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో ఓడించింది. ఈ సందర్భంగా, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ హ్యాండిల్ కోహ్లీ ఫోటోను పోస్ట్ చేసింది.

ఇందులో కోహ్లీని అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ ఫోటోతో మార్ఫ్ చేశారు. పుష్ప పోస్ట్ చేస్తూ “తగ్గేదే లే” అని కామెంట్ ని జత చేశారు. ఈ పోస్టర్‌కు, అల్లు అర్జున్ కూడా స్పందించారు. అల్లు అర్జున్ ఒక స్మైలీ ఎమోజీని ఇస్తూ ఒక లైక్ తో తన యొక్క అంగీకారాన్ని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్, విరాట్ కోహ్లి కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss