Kohli Fire On ICC Test Championship
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై 227 పరుగుల తేడాతో తీవ్ర ఓటమిని ఎదుర్కొంది. ఈ ఓటమితో ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం భారత్ ఈ ఓటమితో టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబల్ లో మొదటి స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోవడమే. అంతే కాదు మొన్నటి వరకు నాల్గోవ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మొదటి స్థానానికి వచ్చేసింది.
దీనితో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) పై గుర్రుమన్నాడు. టెస్ట్ ఛాంపియన్షిప్ నిబంధనలను అకస్మాత్తుగా మార్చినందుకు, మ్యాచ్ అనంతర జరిగిన విలేకరుల సమావేశంలో ఫైర్ అయ్యాడు.
గత సంవత్సరం లాక్డౌన్ సందర్భంగా, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసిసి క్రికెట్ కమిటీ, జట్లు సంపాదించిన పాయింట్ల శాతం (పిసిటి) ద్వారా ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్లను నిర్ణయిస్తుందని నిర్ణయించారు. ఇప్పుడు ఇది భారత్ కి కలిసి రాకపోవడంతో కోహ్లీ ఈ పద్ధతిని తప్పు పట్టాడు. గ్రౌండ్ లో కష్టపడటం మాత్రమే తమకు తెలుసునని ఇవేమీ పెద్దగా పట్టించుకోమని లాస్ట్ లో కోహ్లీ అన్నాడు.
ఏది ఏమి అయినప్పటికీ భారత్ రానున్నమూడు టెస్టుల్లో ఖచ్చితంగా రెండు విజయాలు, ఒక డ్రా చేస్తేనే ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లగలుగుతుంది. మరొక్క ఓటమి ఎదురయ్యినా భారత్ ఈ ఛాంపియన్షిప్ నుంచి వైదొలగినట్లే. ఇక ఇంగ్లండ్ అవకాశాలను పరిశీలిస్తే వారు కూడా మనలానే రెండు లేదా అంతా కన్నా ఎక్కువ విజయాలు సాధిస్తే ఫైనల్ కు వస్తారు. అలానే లార్డ్స్ లో జరగనున్న ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యిందన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: