Wednesday, April 21, 2021

Latest Posts

సలైవా, చెమట సమస్యకు చెక్ పెట్టనున్న కుక‌బుర్రా..!!

Kookaburra Company develops wax applicator for cricket balls

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట్ కార్య‌క‌లాపాలు స్తంభించిన వేల ఐసీసీ కొన్ని మార్పులు చేసేందుకు సమాలోచనలు చేస్తోంది. క్రికెట్ మ్యాచ్‌ల్లో బంతి మెరుపును పెంచటానికి కి ప్లేయ‌ర్లు ఉమ్మి, చెమ‌ట‌ను వాడ‌తారు.  అయితే ప్ర‌మాదక‌ర క‌రోనా వైర‌స్ విస్తరిస్తున్నవేళ‌.. వీటిని నిషేధించ‌డంపై అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) దృష్టి సాదించింది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ బంతుల‌ను త‌యారీ చేసే కుక‌బుర్రా కంపెనీ కొత్త ఐడియాతో ముందుకు వ‌చ్చింది. స‌లైవా, చెమ‌ట‌ల‌కు బదులుగా కొత్త ప‌రికారాన్ని క‌నుగొన్న‌ట్లు తాజాగా వ్యాఖ్యానించింది. కరోనా సంక్షోభం ముగిశాక త్వ‌ర‌లోనే దీనిని పరిశీలిస్తామ‌ని పేర్కొంది.

వ్యాక్స్ అప్లికేట‌ర్ అనే ప‌రిక‌రంతో బంతిపై రుద్ద‌వచ్చ‌ని, సలైవా, చెమ‌ట‌కు ఇది ప్రత్యామ్నాయం గా ప‌నిచేస్తుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ప్రయోగ దశ లో వున్న  ఈ ప‌రిక‌రం చాలా వ‌ర‌కు మంచి ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ప‌రిక‌రంతో వ్యాక్స్ (మైనం)ను బంతి ఉప‌రితలంపై రుద్దేందుకు ప‌నికొస్తుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు అంటున్నారు. అయితే ఇది తాత్కాలిక వెసులుబాటు మాత్ర‌మేన‌ని పేర్కొవటం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss