Friday, March 5, 2021

Latest Posts

రిటైర్మెంట్ ముందే ప్రకటించిన ఆచార్య డైరెక్టర్

Koratala Siva made shocking comments about his career

ఉద్యోగులకు పదవీ విరమణ ఉంటుందే తప్ప రాజకీయనేతలకు ,సినిమా వాళ్లకు ఉండదు. ఊపిరి ఉన్నంతకాలం నటిస్తామని నటీనటులు,చివరిదాకా దర్శకత్వం చేస్తామని దర్శకులు భావిస్తారు. కానీ కొందరు కేరీర్ పీక్ లో ఉండాలనే తప్పుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ అదే చేస్తాడట.

మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను` వంటి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన  కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే లాక్ డౌన్ తో షూటింగ్ నిలిచిపోయింది.  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొరటాల శివ షాకింగ్ కామెంట్స్ చేసారు.

` అనుకోకుండా ఈ సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా. నేను మహా అయితే మరో అయిదారేళ్లు ఫీల్డ్ లో వుంటానేమో. ఈ లోపే నేను చేయాలనుకుంటున్న సినిమాలన్నింటినీ చేసెయ్యాలి. సమయం వృథాగా పోతుంటే బాధగా ఉంది` అని కొరటాల చెప్పారు. అలాగే `ఆచార్య` సినిమాలో రామ్‌చరణ్ ఉన్నాడని కన్ఫామ్ చేశారు. అతని పక్కన హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదని తెలిపారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss