Monday, July 26, 2021

Latest Posts

దర్శకత్వం నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకొనున్న కొరటాల

Koratala Siva Retirement For Films

టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. మంచి సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. నేడు జూన్‌ 15 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, స్టార్‌ హీరోలు శుభాకంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆయన బర్త్‌డే నేపథ్యంలో కొరటాలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పరిశ్రమలో సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న కొరటాల శివ తన రిటైర్‌మెంట్‌ గురించి ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడట. దర్శకుడిగా మారినప్పుడే తాను10 చిత్రాలను తెరకెక్కించాలని, ఆ తర్వాత రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని అనుకున్నట్లు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికి దర్శకుడిగా మాత్రం ఉండనని చెప్పుకొచ్చేవాడు.

అంతేగాక నిర్మాతగా చేయాలనేది ఆయన కోరిక అని, అందుకే దర్శకుడిగా మారడానికి ముందే 10 కథలను రాసిపెట్టుకున్నట్లు చెప్పాడు. వాటిని పూర్తి చేసి.. డైరెక్షన్‌కు గుడ్‌బై చె‍ప్పేసి.. నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మిస్తానంటు గతంలో ఓ స్టెట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఇంతటి సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అతి తక్కువ కాలంలోనే రిటైర్మెంట్‌ తీసుకోవడమనేది నిజంగా బాధకరమైన విషయమే. మరీ ఆయన ఫిక్స్‌ అయినట్లుగా రిటైర్‌మెంట్‌ తీసుకుంటారా? లేదా? అనేది 10 సినిమాల తెరకెక్కించేవరకు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss