Tuesday, April 13, 2021

Latest Posts

మరీ అంత విషమంగా లేదు అంటున్న దక్షిణ కొరియా ప్రభుత్వం

Korean government says North Korean leader Kim Jong Un’s health is unheard

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన వార్తలలో నిజం లేదని వాళ్ళ అధినేతకు ఆరోగ్యం అంత విషమంగా లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. కిమ్ కి కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన హెల్త్ ఆందోళనకరంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు అక్కడి ప్రభుత్వ అధికారుల నుంచి అందిన సమాచారాన్ని కొట్టిపడేస్తూ దక్షిణ కొరియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఈ నెల 12 న కిమ్ కి సర్జరీ జరిగిన అనంతరం హ్యాంగ్ శాన్ లోని మౌంట్ కుమ్ గాంగ్ రిసార్ట్ లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని అక్కడి అజ్ఞాత వర్గాలకు తెలియజేసినట్టు కిమ్ హెల్త్ చాలా డేంజర్ లో ఉందని సీఎన్ ఎన్ పేర్కొంది. కానీ మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఏప్రిల్ 12 న ఆయన ఎయిర్ బేస్ ని విజిట్ చేసినట్లు, ఫైటర్ జెట్ల విన్యాసాన్ని అతడు చూశాడని నార్త్ కొరియా మీడియా తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల అనంతరం సైనిక విన్యాసాల్లో భాగంగా సముద్రంలోకి స్వల్ప దూర నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణులను ప్రయోగించారని, అలాగే సుఖోయ్ జెట్ విమానాలు ఆకాశ మార్గం నుంచి భూతలానికి మిసైల్స్ ని పేల్చాయని ఈ డ్రిల్స్ అన్నింటినీ కిమ్ పర్యవేక్షించాడని కూడా ఈ మీడియా వివరించింది. ఇలా పరస్పర విరుధ్ధ కథనాలు వెల్లువెత్తుతున్న నైపద్యంలో అక్కడి ప్రభుత్వ వర్గాలు కిమ్ కు  సర్జరీ ఐనా మాట వాస్తవమని తరువాత ఆయన చికిత్స పొందుతున్నారని,  అంతే తప్ప ఆయన ఆరోగ్యంపై వస్తున్న కథనాలు నిజం కాదని వారు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss