Ravi Teja Krack Box Office Collection
రవితేజ, గోపీచంద్ మలినేని కలిసి తీసిన మూడో చిత్రం క్రాక్. ఈ క్రాక్ చిత్రం కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది.
కరోనా కారణంగా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే తొలిరోజు నైట్ షోస్ తర్వాత రెండో రోజు రచ్చ చేసాడు రవితేజ. మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ హవా కనిపించింది. ఈ సినిమా ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రేడ్‌కు కూడా షాక్ ఇస్తూ దూసుకుపోతుంది. జనవరి 11న వసూళ్ళు చూసి ట్రేడ్ కూడా షాక్ అవుతుంది. కరోనా ఉన్నా కూడా థియేటర్స్ దగ్గర ఆడియన్స్ క్యూ కడుతున్నారు. పండగ సీజన్ కావడం.. పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతుంది.
ఇకపోతే మూడో రోజు కూడా క్రాక్ దాదాపు 4 కోట్ల వరకు షేర్ రాబట్టిందని అంచనా అది కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. థియేటర్స్ ఎక్కువ ఉండటంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: