Monday, July 26, 2021

Latest Posts

బాలకృష్ణ సినిమాలో క్రాక్ నటి

Krack Heroine In NBK 107

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఈ చిత్రం బాలకృష్ణ 107వ చిత్రంగా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో క్రాక్ చిత్రంలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ నటించనున్నట్లు సమాచారం. తన అద్భుతమైన, శక్తివంతమైన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. క్రాక్ చిత్రంలానే ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

బాలకృష్ణ వంటి మాస్ నటుడు మరియు నెగెటివ్ షేడెడ్ పాత్రలను సులభంగా చేయగల వరలక్ష్మి కలిసి చేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న అఖండ పూర్తయ్యాక ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss