ఇప్పటికే మీకు కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడేసుకున్నారు అంటు ఏ.పి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో పేర్కొంటూ, సాగర్ కుడి కాల్వ ద్వారా ఏ.పీ కి కేటాయించిన 158.255 టీఎంసీలు అయితే ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏ.పీ ప్రభుత్వానికి లేఖలో తెలిపింది.
ఇది కూడా చదవండి: తోడికోడలు వేధింపులకు తల్లి తన ఇద్దరు పిల్లలు బలి
అలాగే హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 48.328 టీఎంసీల నీటిని వినియోగించినట్లు తెలుపుతూ, రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయపడింది. ఇప్పటికే కేటాయించిన నీటికంటే ఎక్కువ నీటిని వాడుకున్నందున ఆయా కాల్వల ద్వారా నీటి విడుదల ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచిస్తూ లేఖ రాసింది. అయితే ఇంకా ఈ విషయం పై ఏపి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: జూమ్ యాప్ ద్వారా ఆమెకు 2కోట్లు జరిమానా విధించిన కొర్టు