Thursday, May 13, 2021

Latest Posts

పరిష్కార దిశగా తెలుగు రాష్ట్రాల జల వివాధం

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాధం పరిష్కార దిశగా ఇరువర్గాల నుంచి అడుగులు పడుతున్నాయి. అయితే ఈరోజు తెలంగాణలోని జలసౌధలో కృష్ణ రివర్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్ లు మరియు బోర్డు కార్యదర్శి తో కూడిన త్రిసభ్య కమిటీలో పాల్గొనున్నారు. కాగా సాగర్ ఎడమ కాలువ నుంచి ఇప్పటికే రావాల్సిన నీటి వాటా కంటే అదనంగా ఏ‌పి వాడుకుంది అని తక్షణమే నిలిపివేయ్యాలని ఇటీవలే బోర్డు ఆదేశించింది.

అయితే ఇప్పుడు వేసవి కాలం కావడం వలన మరో 2 టి‌ఎం‌సి ల నీటిని విడుదల చేయాలని ఏ‌పి ప్రభుత్వం కోరింది. దీన్ని ఈ రోజు ఈ కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, మరో వైపు కేంద్రం కు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పిర్యాదులతో త్వరలో అపేక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర నీటి వనరుల శాఖ నిర్ణయం తీసుకోనుంది. అయితే దీనికి రెండు రాష్ట్రాల సి‌ఎంల అంగీకారం అవసరం కాగా రెండు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss