Monday, May 10, 2021

Latest Posts

నక్క తోక తొక్కిన ఉప్పెన హీరోయిన్ ‘లక్కీ గర్ల్’

Krithi Shetty Got Bumper Offer
హీరోయిన్ కృతి శెట్టి నక్క తోక తొక్కిందనే చెప్పాలి. ఒక్క సినిమాతో ఇన్ని అవకాశాలు అంటే అదృష్టమనే చెప్పాలి. సహజంగా హీరోయిన్ కి ఒక్క ఛాన్స్‌ దక్కాక రెండో అవకాశం వెంటనే రాకపోవచ్చు. ప్రతిభ ఉన్నా ఇంకో ఛాన్స్‌ రావడానికి టైమ్‌ పట్టొచ్చు. వస్తే మాత్రం అదృష్టవంతుల కిందే లెక్క. అయితే ఇప్పుడు వరుసగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడిని అందరూ ‘లక్కీ గర్ల్‌’ అంటున్నారు.

అవునండి ఈమె ఏకంగా నాలుగు సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమై, తనలో మంచి ప్రతిభ ఉందని నిరూపించుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, హీరో రామ్‌ తాజా చిత్రంలోనూ నటిస్తున్నారు.

తాజాగా ఇప్పుడు తమిళ చిత్రసీమ నుంచి కూడా ఈమెకు బంపర్‌ ఆఫర్‌ దక్కిందని టాక్‌. మాస్‌ హీరో ధనుష్‌ సరసన కృతి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట. ధనుష్‌ హీరోగా ‘మారి’, ‘మారి 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్‌ ఈ హీరోతో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనే కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని సమాచారం. మొత్తం మీద ఈ అమ్మడు జాక్ పాట్ కొట్టినట్టే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss