Sunday, June 20, 2021

Latest Posts

మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసిన ఉప్పెన హీరోయిన్

Krithi Shetty Rejected Mega Hero Movie

ఒక్క సినిమాతో కుర్రకారు దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి. ఈ ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్‌ను సంపాదించుకుంది. నిజానికి సినిమా రిలీజ్‌​ అవడానికి ముందే ఆమె టాలీవుడ్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. సినిమా ప్రోమో, సాంగ్స్‌లో కృతీని చూసిన కుర్ర కారు ఆమె అందం, అభినయానికి మంత్రముగ్ధులయ్యారు. దీనితో దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ఎగబడ్డారు. ఆమె ఇప్పటికే నాలుగు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న ఈ కుర్ర హీరోయిన్కి మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. అది కూడా మెగా హీరో సినిమాలో. ప్రస్తుత అప్‌డేట్ ప్రకారం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టిని సంప్రదించినట్లు టాక్. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ ఉప్పెన హీరోయిన్ ఈ మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే అందుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss