Sunday, June 20, 2021

Latest Posts

పుకార్లకు చెక్ పెట్టిన బేబమ్మ

krithi shetty upcoming movies in telugu

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న హీరోయిన్ కృతీ శెట్టి. నిజానికి సినిమా రిలీజ్‌​ అవడానికి ముందే ఆమె టాలీవుడ్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. సినిమా సాంగ్స్‌లో కృతీ అందం, అభినయానికి యువత ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం ఎగ బడ్డారు.

అయితే కృతి ఆమె ప్రస్తుతం నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో పాటు సుధీర్‌ భాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కొత్త చిత్రంలోనూ కృతిని హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ మూడు చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలకు ఈ హీరోయిన్ సంతకం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆమె హీరోలు ధనుష్‌, నితిన్‌, సూర్య, బెల్లంకొండ గణేష్‌ సినిమాలతో పాటు మరోసారి వైష్ణవ్‌ తేజ్‌ సరసన నటిస్తుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని తేల్చిపారేసింది కృతీ.

“నా తర్వాతి ప్రాజెక్టుల గురించి రోజూ రూమర్లు వింటున్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. అవి హీరోలు నాని, సుధీర్‌ బాబు, రామ్‌తో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేయడం మీదే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఒకవేళ మరేదైనా ప్రాజెక్ట్‌ ఒప్పుకుంటే నేనే స్వయంగా తెలియజేస్తాను” అని కృతీ శెట్టి పుకార్లకు చెక్ పెట్టింది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss