Sunday, June 20, 2021

Latest Posts

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి పై కే‌టి‌ఆర్ ఫైర్

KTR Fire On Delhi Government Hospital

మలయాళ నర్సింగ్ సిబ్బందిని హిందీ, ఇంగ్లీషు భాషలలో మాత్రమే సంభాషించాలని ఆదేశించినందుకు తెలంగాణ మంత్రి కెటిఆర్ ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రి పై విరుచుకుపడ్డారు. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలని, ఆ ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించలేరని కెటిఆర్ అన్నారు.

కే‌టి‌ఆర్ ఏం చెప్పారంటే, “భారతదేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయి. వాటిలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ ఇలా చాలా ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో మాట్లాడే హక్కు ఉండాలి మరియు ఆ ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించకూడదని ఇది ఇతర భాషలను తక్కువ చేసినట్లుగా ఉందని అన్నారు ”.

హాస్పిటల్ సిబ్బంది ఒకరితో ఒకరు సంభాషించడానికి మలయాళం వాడుతున్నట్లు రోగి ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఆసుపత్రి ఈ వింత నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మలయాళంలో సిబ్బంది సంభాషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి పరిపాలన పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss