Monday, March 1, 2021

Latest Posts

ప్రధాని మోడీ ఆదేశాలతో మేం వ్యాక్సిన్ తీసుకోవడం లేదు కే‌టి‌ఆర్

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతోనే మేం ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలని అనుకున్నాం కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే ముందుగా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో  మేం ఏకీభవిస్తూ మేం ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు.

అంతేకాకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చే దాకా వేచి ఉంటామని కే‌టి‌ఆర్ తెలిపారు. ఇకపోతే హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా మారిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, కరోనా వ్యాక్సిన్‌ పై ఉన్న భయాలను పటా పంచలు చేస్తూ ఇది సురక్షితం అని ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. కాగా, ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss