Monday, July 26, 2021

Latest Posts

కృష్ణా నీటి కోసం దేవుడితోనైనా పోరాడతాము

KTR Shocking Comments On Krishna Water Issue

ఎపి, తెలంగాణ మధ్య నీటి యుద్ధం టిఆర్ఎస్, వైసిపి ప్రభుత్వాల మధ్య విభేదాలను రేకెత్తించింది. ఈ వివాదాల పై తెలుగు రాష్ట్రాల మంత్రులు తీవ్రమైన వాదనలు చేసుకుంటున్నారు. ఏపీ సి‌ఎం జగన్  పొరుగు రాష్ట్రంతో నీటి గురించి వివాదం పెట్టుకోదలుచుకోలేదని చెప్పి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు.

శనివారం నారాయణపేటను సందర్శించిన తెలంగాణ మునిసిపల్ మంత్రి కెటిఆర్ నీటి వివాదం పై మాట్లాడాడు. నీటి వివాదంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తెలంగాణకు చెందిన నీటిలో సరైన వాటా పొందడానికి మేము దేవునితో కూడా పోరాడతామని తెలిపాడు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి కృష్ణ నది నీరు లభిస్తుందని చెప్పాడు. ”

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు ఉపశమనం కలిగించే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని కెటిఆర్ పునరుద్ఘాటించారు. మరో వైపు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి తగిన నిధులు మంజూరు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss