KTR strong counter to ramgopal varma tweet
దేశం మొత్తం కరోనా పెరిగిపోతోంది. వందల మంది చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలను , రాం గోపాల్ వర్మ ఏం అడిగారా తెలుసా? అవును తనకి కావలసిందే అడిగాడు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలలానే పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా అది అందజేయాలని కోరారు. ఇంతకీ రాం గోపాల్ వర్మ అడిగిందేమిటో చూడండి… తాజాగా రాంగోపాల్ వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. “ఇళ్లలో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారు. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.
మెంటల్ హాస్పటళ్లలో చేరుతున్నారు. ఫ్రస్ట్రేషన్లో కొందరు భర్తలు భార్యలను కొడుతున్నారు.. మీరు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకుని మాకు ‘చీర్స్’ చెప్పండి” అని ట్వీట్ చేశారు. దీనికి పశ్చిమ బెంగాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వార్తను జత చేశారు. ఇప్పుడు అర్థమైందనుకుంటా ఆర్జీవీ ఏం అడిగాడో.. అయితే దీనికి మంత్రి కేటీఆర్ కూడా చమత్కారంగానే సమాధానమిచ్చారు.
‘రాము గారు మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా..’ అంటూ తనకేం అర్థం కానట్లు సెటైర్ వేశారు. ఇక వీరిద్దరూ ఇలా ట్విటర్లో పరస్పరం పలకరించుకోవడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆర్జీవీ పెట్టిన ట్వీట్లకు కేటీఆర్ సరదాగా కామెంట్లు పెట్టేవారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను పొగుడుతూ ఆర్జీవీ పెట్టిన ట్వీట్‌కు కూడా కేటీఆర్ ఇలాగే సరదాగా రిప్లై ఇచ్చారు.