జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. జమ్ము కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద కొంత మంది ముష్కరులు భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి అమరులయ్యారు. రెండు రోజుల క్రితం ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్ సెక్టార్లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్థరాత్రి దాటాక భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో సైన్యం ప్రతిఘటించింది. ఒక ఉగ్రవాదితో పాటు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన కానిస్టేబుల్ ఒకరు మరణించారు.
కాగా ఆదివారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అదే ప్రాంతంలో మళ్లీ చొరబాట్లకు యత్నించడంతో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగగా ఆ కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు ఒక ఆర్మీ అధికారి మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన జెవాన్లు ఉన్నారు. ఒకరు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ర్యాడ మహేశ్(26) వీర మరణం పొందగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) కూడా అమరుడయ్యారు.
ఇది కూడా చదవండి: