Kurasala Kannababu Counter To Nara Lokesh:
ఏపీలో ఏదో ఒక అంశంపై నిత్యం అధికార ,విపక్షాల నడుమ రాద్ధాంతం జరుగుతూనే ఉంది. తాజాగా టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. రైతుకి విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. సున్నా వడ్డీకే రుణాలు అంటూ హడావిడి చేసి దొరికిపోయారని, రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారని, రూ.2 వేల కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
9 నెలల పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఊసేలేదని ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, 25 లక్షల ఇళ్ల స్థలాలు పెద్ద బోగస్ అని నారా లోకేష్ మండిపడ్డారు కాగా జగన్ విమర్శలపై మంత్రి కన్నబాబు స్పందిస్తూ, జగన్ రైతు వ్యతిరేకి అనడానికి లోకేష్‌కి నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు మాటలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
సంక్షేమ పథకాల అమలులో పెన్షన్ల పంపిణీ ఓ రికార్డు అని మంత్రి కన్నబాబు అన్నారు. తెల్లవారకముందే తలుపు తట్టి పెన్షన్లు అందజేశామన్నారు. టీడీపీని ప్రజలు తిరస్కరించబట్టే 23 స్థానాలకు పడిపోయిందన్నారు.బీసీ రిజర్వేషన్లపై టీడీపీ వాళ్లే కోర్టుకు వెళ్లారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేసులో టీడీపీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ఆయన ప్రశ్నించారు.