Wednesday, January 20, 2021

Latest Posts

ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం

షార్జా క్రికెట్‌ స్టేడియం లో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్ నిన్న బెంగుళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో ఎనమిది వికెట్ల తేడాతో సాధించింది. వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్‌కు గేల్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన మార్కు స్టైల్‌ ఆటతో పంజాబ్‌ ఊపిరి తీసుకునే విజయాన్ని అందించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్‌ తర్వాత సిక్స్లతో మంచి జోష్‌ తీసుకొచ్చాడు. 45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు. అతనికి జతగా కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌; 49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) మరోసారి రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించింది. కింగ్స్‌పంజాబ్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆ తర్వాత గేల్‌, రాహుల్‌లు ఓ సొగసైన ఇన్నింగ్స్‌ ఆడారు. కాగా, చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్‌ సిక్స్ తో ఇన్నింగ్స్‌ను ఫినిష్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌కు విజయం దక్కింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌కు మాత్రమే వికెట్‌ లభించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కింగ్స్‌ పంజాబ్‌దే పైచేయి అయ్యింది. ఇది పంజాబ్‌కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss