Latest and Upcoming Films of Dil Raju:
సినిమా పేర్లను ఇంటి పేరుగా మార్చుకున్న హీరోలు,రచయితలూ ఉన్నట్టే,ఓ ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. అతడే దిల్ రాజు. దిల్ సినిమాతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అదే సినిమా పేరును ఇంటిపేరుగా దిల్ రాజు కి వచ్చేసింది. అందుకే శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దిల్ రాజు మూవీ అంటే చక్కగా ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లి చూడొచ్చనే నమ్మకం ఆడియన్స్ లో కల్గించారు.
ఎంతటి వారికైనా జయాపజయాలు ఎవరికైనా తప్పవని అన్నట్లుగా దిల్ రాజు విషయంలోనూ కనిపిస్తోంది. ఎందుకంటే హిట్స్ మీద హిట్స్ కొడుతూ, ఎన్నో గొప్ప విజయాలను చవిచూసిన దిల్ రాజు రీసెంట్ గా సరైన హిట్లను అందుకోలేకపోయాడు. ఇక ఆయన తమ్ముళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి నిర్మాతలుగా పరిచయం చేసాడు. పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా దిల్ రాజు నిర్మిస్తుంటాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హిందీ పింక్ ని వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తుండగానే మరో చిన్న సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో బయట హీరోలను కాకుండా తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ,మరో వారసత్వాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘పలుకే బంగారమాయెరా..’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు టాక్. ఈ సినిమాకు హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడట. ఇంతకీ దిల్ రాజుకు తన ఇంటి నుండి హీరోను పరిచయం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి