Home రాజకీయం వీళ్ళు అస్సలు బయటకు రావద్దట

వీళ్ళు అస్సలు బయటకు రావద్దట

Lav agarwal on about Coronavirus

lav agarwal is comments on coronavirus:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కునుకు తీయడం నీయలేదు. ఇక మన దేశంలో కూడా కరోనా వైరస్ జడలు విప్పడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. గురువారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియా ముందుకొచ్చి, సరికొత్త మార్గదర్శకాలను వివరించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అలాగే పదేళ్ల లోపు చిన్నారులను కూడా బయటకు పంపొద్దని ఆయన హెచ్చరించారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు.ఇక, రైళ్లలో అత్యధికంగా ప్రయాణికులు రవాణా అయ్యే అవకాశం ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వేశాఖ రద్దు చేసినట్లు ప్రకటించారు.
అంతేకాదు, ఈ నెల 22 నుంచి 29 వరకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ సర్వీసులను కేంద్రం రద్దు చేసేసింది. ఈ మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా చాలా కఠినంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. వీలైనంత మేరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version