Home రాజకీయం క్వారంటైన్ అంటే ధ్యానంలో ఉండటం

క్వారంటైన్ అంటే ధ్యానంలో ఉండటం

Lav agarwal says quarantine means being in meditation

మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన తొమ్మిది వేల మందిని తాము గుర్తించామని, దేశంలో ఇప్పటి వరకూ 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వాటిలో నిజాముద్దీన్ జమాతేకు వెళ్ళి వచ్చిన దాదాపుగా 400 మందికి పాజిటివ్ వచ్చినట్లు మిగిలిన వారందర్నీ క్వారంటైన్‌కు తరలించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు.

క్వారంటైన్ లో ఉన్నవారందరూ అలాగే ఉండాలని, క్వారంటైన్ అనేది ఓ తపస్సు లాంటిదని లవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సుమారుగా  13వందల మంది విదేశీయులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారని  యితే కరోనా సోకిన వారితో 1950 మందికి లింక్ ఉందని ఆయన చెప్పారు.  24 గంటల్లో 324 మందికి పాజిటివ్ రాగా 12 మంది చనిపోయినట్లు ఆయన ధృవీకరించారు. ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నియమాలను తప్పకుండ పాటించాలని, లాక్‌డౌన్ నిబంధనలను ఎవరు అతిక్రమించరాదు అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version