Thursday, March 4, 2021

Latest Posts

8000 మంది సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏ‌పి.ఎస్‌.ఆర్‌.టి‌.సి.

కరోనా సమయంలో ఆర్ధికంగా నష్టపోతున్న రంగాల్లో ఇప్పటికీ నష్టాల్లో ఉన్న టి‌ఎస్‌ఆర్‌టి‌సి ఒకటి,  కాగా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏ‌పి.ఎస్‌.ఆర్‌.టి‌.సి లోని 8000 మందిని విధులనుంచి తొలగించింది. దీని కారణగా వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రకార్లను తమ ఉపాధి కోల్పోయారు , ప్రభుత్వ సంస్థలలో కరోనా కారణాంగ  ఉద్యోగులను విధులనుంచి తొలగించిన ఏకైక సంస్థగా ఏ‌పి.ఎస్‌.ఆర్‌.టి‌.సి పై ముద్ర పడనుంది.

కాగా కరోనా మహమ్మారి వలన బస్సులు రోడ్ల పైకి వచ్చే అవకాశం లేదు, ఒక వేళ వచ్చినా భౌతిక దూరం పాటిస్తూ ఉన్న సీట్లను కుదించి సర్వీసులను ప్రారంభించినా ఇంతకు ముందు కంటే నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. కావున 7,600 మందికి పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించి పూర్తి విధులకు శాశ్వత ఉద్యోగులను రంగంలోకి దింపనుంది ప్రభుత్వం. కాగా 52 వేల మందికి పైగా ఉన్న శాశ్వత ఉద్యోగులకు నెలకు రూ. 280 కోట్లు ఖర్చు కాగా, 8000 మంది ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  నెలకు 9 కోట్ల వరకు జీతాలు ఖర్చు అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: వినూత్న రీతిలో టీడీపీ మహానాడు

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss